నయనతారపై షారుక్ ప్రశంసలు

Jawan

నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి చిత్రం.. జవాన్. ఆమె షారుక్ ఖాన్ కి వీరాభిమాని. తన మొదటి హిందీ చిత్రం తన అభిమాన హీరో సరసన కావడంతో నయనతార చాలా ఆనందంగా ఉంది. ఇక ఆమెపై షారుక్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.

“ఆమె అందమైన, అద్భుతమైన నటి. ఆమె తన పాత్రకు వన్నె తెచ్చింది. తమిళ ప్రేక్షకులు మరోసారి ఆమెతో ప్రేమలో పడుతారు అని ఆశిస్తున్నా. హిందీ ప్రేక్షకులు ఆమె శ్రమని అభినందిస్తారు అని అనుకుంటున్నా,” అని షారుక్ ఖాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

“జవాన్” సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రకు దీపిక పదుకోన్ హీరోయిన్. రెండో పాత్రకు నయనతార. ఈ సినిమాలో నయనతార పోలీసు అధికారిగా నటిస్తోంది. సో, ఆమె గ్లామర్ తో పాటు “యాక్షన్” కూడా చేస్తోంది.

నయనతార అభిమానులు షారుక్ ట్వీట్ తో ఆనందంగా ఉన్నారు. ఆయన ట్వీట్ ని తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement
 

More

Related Stories