
బాలీవుడ్ ఇండస్ట్రీని ఏళ్లుగా శాసించిన షారుక్ ఖాన్ ఇప్పుడు డౌన్ లో ఉన్నారు. అపజయాలు, రాజకీయాలు, కరోనా సంక్షోభాలు… అన్ని కలిసి ఆయన నుంచి నాలుగేళ్లుగా సినిమాలు రాకుండా చేశాయి. మొత్తానికి ఇప్పుడు కొత్త సినిమా ముస్తాబవుతోంది.
షారుక్, జాన్ అబ్రహం, దీపిక పదుకోన్ నటిస్తున్న ‘పఠాన్’ సినిమా జనవరి 25, 2023న విడుదల కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే షారుక్ మూవీ వస్తోంది. 2018లో విడుదలైంది ‘జీరో’. అంటే ఎగ్జాట్లీ నాలుగేళ్ల తర్వాత ఇంకో మూవీ ఆయన అభిమానులను అలరించనుంది. షారుక్ కెరీర్లో ఇదే లాంగ్ గ్యాప్.
ఈ సారి ‘పఠాన్’ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా పెద్ద ఎత్తున విడుదల చెయ్యనున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దేశభక్తి చిత్రంగా రూపొందుతోంది.
మరోవైపు, షారుక్ పిల్లలు కూడా ఈ ఏడాది అరంగేట్రం చేస్తున్నారు. కూతురు జోయా అక్తర్ డైరెక్షన్లో హీరోయిన్ గా పరిచయం కానుంది. కొడుకు రైటర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.