
కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తనదైన ముద్రను సొంతం చేసుకున్న “యస్ ఓరిజినల్స్” కొత్త ఏడాదిలో మరింత వేగం చూపించబోతుంది. ఈ సంవత్సరంలో యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నాయి అంటున్నారు నిర్మాత సృజన్ యరబోలు.
“యస్ ఓరిజినల్స్ ను టాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలుపాలన్నదే నా కోరిక. ఇప్పటి వరకూ భాగస్వామ్యంలో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పడు యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండే ఈ యేడాది 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ దాదాపుగా ముగింపుకు రావడం చాలా సంతోషంగా ఉంది,” అన్నారు సృజన్.
“పంచతంత్రం, సంతోష్ శోభన్ హీరోగా మరో చిత్రం, సుమంత్ హీరోగా రూపొందుతన్న అహం, బ్రహ్మానందం గారి తనయుడు గౌతమ్ హీరో గా చేస్తున్న సినిమా, గతం సినిమా తో విమర్శకుల ప్రశంసలు పొందిన కిరణ్ దర్శకత్వంలో అదే టీంతో మరో సినిమా రూపొందిస్తున్నాం,” అని తెలిపారు.
ఇంకా కన్నడంలో, హిందీలో కూడా తీస్తున్నారట.