ఇద్దరికీ ‘కథలు’ మారాయి


సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి సినిమాలు అటకెక్కనున్నాయి అని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా గురించి రూమర్స్ వచ్చాయి. కథ నచ్చక మహేష్ బాబు ఈ సినిమాని పక్కన పెట్టారు అనేది ఆ పుకార్ల సారాంశం.

ఇక, పవన్ కళ్యాణ్ కూడా దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన కథ నచ్చక ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాని వదిలేసి ఇతర సినిమాలు ఒప్పుకుంటున్నారనే మాట వైరల్ అయింది.

ఐతే, ఈ రెండు సినిమాలు ఆగలేదు. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా వచ్చే నెలలో మొదలు కానుంది. ఈ సినిమాకి కథ మారిపోయింది. ముందు అనుకున్న యాక్షన్ డ్రామాని పక్కన పెట్టి పక్కా ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు త్రివిక్రమ్.

ఇక, హరీష్ శంకర్ కూడా తాను ముందు అనుకున్న పొలిటికల్ డ్రామాని పక్కన పెట్టి “తెరి” అనే తమిళ సినిమా కథ స్పూర్తితో తనదైన శైలిలో కథని రెడీ చేసుకున్నాడు. అందుకే, పాత్ర పేరుతో పాటు సినిమా టైటిల్ కూడా మారింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్’ అయింది.

 

More

Related Stories