ప్రకటనకు కూడా డిలేనా?

SSMB28

ఫలానా డేట్ కి ఒక ప్రకటన చేస్తాం, లేదా ప్రోమో విడుదల చేస్తామని చెప్పి అభిమానులను వెయిట్ చేయిస్తారు. తీరా ఆ టైంకి డిలే అయింది… ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాలంటూ ఫ్యాన్స్ ని ఊరించే టెక్నీక్ లు ఎక్కువగా రాజమౌళి సినిమాల ప్రొమోషన్ టీమ్స్, యూవీ క్రియేషన్ సంస్థలు చేస్తుంటాయి. ఇలాంటి బాడ్ నేమ్ ఉన్న మరో సంస్థ… హారిక హాసిని క్రియేషన్/సితార.

ఈ రోజు నాలుగు గంటల 5 నిమిషాలకు మహేష్ బాబు – త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రకటిస్తామని చెప్పి … టైంకి మరికొద్దిసేపు డిలే ఉంటుంది అని చెప్పారు. ప్రోమో రెడీ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వీరి కాంబినేషన్లో సినిమా ఉంది అని చెప్పడానికి సాంకేతిక ఇబ్బందులు ఏమి ఉంటాయి. అదే మరి హారిక హాసిని సంస్థ/సితార చేసే ట్రిక్కు.

ఇంతకీ ఎందుకు డిలే అయింది అంటే… మహేష్ బాబు, త్రివిక్రమ్ ఫొటోలతో చిన్న వీడియో తయారు చేశారు. గంట ఆలస్యంగా ఆ ప్రకటన కానిచ్చారు. ఆల్రెడీ మీడియాలో వచ్చిన వార్తలకు లాంఛనంగా ప్రకటన ఇది. దీనికి ఇంతా హంగామా. ఈ గంట గ్యాప్లో ఆ సంస్థను మహేష్ బాబు అభిమానులు ఓ రేంజులో ట్రోల్ చేశారు.

More

Related Stories