‘ఫైట్ మాస్టర్స్’తో ఫైట్ జరగలేదట

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో జరుగుతోన్న మూడో చిత్రం ఇటీవలే మొదలైంది. మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. అప్పుడే ఈ సినిమాపై గాసిప్పులు పుట్టుకొచ్చాయి. వారం రోజులు జరగాల్సిన షూటింగ్ 3 మూడు రోజులకే ముగిసింది. దాంతో… సెట్ లో ఎదో గడబిడ జరిగింది అన్న వార్తలు మొదలయ్యాయి.

ఈ సినిమా కోసం ‘కేజీఎఫ్’ ఫైట్ మాస్టర్లు అన్బరివ్ (Anbariv)ని తీసుకొచ్చారు. ఐతే, వాళ్ళ వర్క్ విషయంలో మహేష్ బాబు సంతృప్తికరంగా లేడని, అందుకే తొందర్లో షూటింగ్ ప్యాకప్ అయింది అని ఒక వెబ్ సైట్ లో వార్త వచ్చింది. దాంతో, నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

“మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. అద్భుతమైన ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించాం. రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలవుతుంది. ఆ షెడ్యూల్ లో హీరో మహేష్ బాబు, బుట్టబొమ్మ పూజ హెగ్డే పాల్గొంటారు,” అని నిర్మాత వివరణ ఇచ్చారు.

మొత్తమ్మీద, ఫైట్ మాస్టర్లతో హీరో మహేష్ బాబు కి ఎలాంటి ఫైట్ కానీ, గొడవ కానీ జరగలేదని చెప్తున్నారు.

 

More

Related Stories