అంతా కొత్త కొత్తగా

SSMB28


మహేష్ బాబు 2022కి గుడ్ బై చెప్పేశారు. ఈ ఏడాది ఆయన తన వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులు చూసిన విషయం తెలిసిందే. అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణని కోల్పోయారు. ఇక కెరీర్ పరంగా కూడా పెద్దగా సంతృప్తి దక్కలేదు మహేష్ బాబుకి. ‘సర్కారు వారి పాట’ పెద్దగా ఆడలేదు.

2022 చివర్లో SSMB28 సినిమా షూటింగ్ మొదలుపెడతారు అని అనుకున్నారు. అలానే ప్లాన్ చేశారు నిర్మాతలు. కానీ, మహేష్ బాబు షూటింగ్ మూడ్ లో లేరు. ఆయన షార్ట్ ట్రిప్ కోసం దుబాయ్ వెళ్లారు. అలాగే, మరో వారం తర్వాత న్యూ ఇయర్, క్రిస్మస్ వెకేషన్ కోసం విదేశాలు వెళ్తారు. సో, ఈ ఏడాది SSMB28 స్టార్ట్ అవలేదు.

కొత్త ఏడాదిలో కొత్తగా SSMB28ని మొదలు పెడతారట. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐదు రోజుల పాటు ఈ సినిమా కోసం మహేష్ బాబుపై ఒక యాక్షన్ సీన్ తీశారు. దాన్ని ఇప్పుడు డస్ట్ బిన్ లో పడేశారు.

ఇప్పుడు కథ మారింది, కథనం మారింది. ఇంతకుముందు ప్లాన్ చేసిన భారీ ఫైట్స్ ఈ సినిమాలో ఉండవు. అందుకే ఇప్పటివరకు జరిగిన పని, కసరత్తు అంతా వృధా. దర్శకుడు త్రివిక్రమ్ మళ్ళీ కొత్తగా సినిమాని మొదలు పెట్టాలి జనవరిలో. కొత్త ఏడాదిలో అంతా కొత్తగా సినిమాని మొదలుపెడతారు మహేష్ బాబు.

 

More

Related Stories