ఇక అడవులు, విదేశాలు

- Advertisement -
Mahesh Babu and Rajamoulii


మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పారు రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి సినిమాలకు దాదాపుగా అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. తాజా ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ … మహేష్ బాబుని పొగిడారు. బాగా ఇంటెన్స్ ఉన్న నటుడు మహేష్ బాబు అని ఆయన అన్నారు.

“క్షణాల్లో ఆయన ఒక మూడ్ నుంచి ఇంకో మూడ్ కి మారగలరు. ఏ రచయిత, దర్శకుడికైనా అంతకన్నా ఏమి కావాలి ఒక నటుడి నుంచి. మా రాజమౌళి చాలా కాలంగా అడవుల నేపథ్యంలో ఒక అడ్వెంచర్ సినిమా చేద్దామని అనుకుంటున్నారు. నా దృష్టిలో మహేష్ బాబుతో ఈ తరహా చిత్రం సూపర్,” అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.

ఈ సినిమా కథ ప్రకారం హీరో అనేక దేశాలు వెళ్లాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ అలా ఉంది. అందుకే, గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అని రాజమౌళి మీడియాకి చెప్పారని విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. కథ మాత్రం అడవి నేపథ్యంగానే ఉంటుందంట.

వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా మొదలు కావొచ్చు అని కూడా ఆయన తెలిపారు.

 

More

Related Stories