16 కోట్లకు ‘అఖండ’

Akhanda

‘అఖండ’ సినిమా టైటిల్ టీజర్ తోనే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే వ్యూస్ పరంగా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు శాటిలైట్, డిజిటల్ డీల్ కూడా కుదుర్చుకొంది. ఇది కూడా భారీ మొత్తానికే. 16 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ శాటిలైట్, డిజిటల్ రైట్స్ చేజిక్కించుకొంది. ఇటీవలే డీల్ లాక్ అయింది.

బోయపాటి సినిమాలకు టీవీల్లో మంచి రేటింగ్స్ వస్తుంటాయి. అట్టర్ ప్లాప్ అయిన ‘వినయ విధేయ రామ’ టీవీల్లో ఎప్పుడు ప్రసారం అయిన భారీ రేటింగ్ పొందుతూనే ఉంది. అందుకే, బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూడో మూవీని భారీ మొత్తానికి తీసుకొంది స్టార్ మా.

నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డికి ఇది పెద్ద రిలీఫ్.

More

Related Stories