
అభిమానించే ప్రేక్షకులకు ఇంకెలాంటి ఎంటర్ టైన్మెంట్ అందించాలి అని నిరంతరం ఆలోచించే “స్టార్ మా” మరో రెండు కొత్త షోలను ప్రారంభిస్తోంది. హ్యూమర్, లాఫ్టర్, సెటైరు మిక్స్ చేసి కామెడీ ని ఆదివారం మధ్యాహ్నం షడ్రసోపేతమైన విందులా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే ఈ కామెడీ ఫుల్ మీల్స్ 3 గంటల వరకు నాన్ స్టాప్ వినోదాన్ని పండించబోతోంది.
ఆదివారం నాడు అలరించబోతున్న ఈ మొదటి షో “స్టార్ట్ మ్యూజిక్”. మైక్ తో మెస్మరైజ్ చేసే సుమ ఈ షో కి తన మార్క్ చేర్చి మరింత పండించబోతున్నారు. సెలబ్రిటీ లతో కళకళ లాడే ఈ షో వినోదాన్ని తళతళా మెరిపించనుంది. ఈ షో తరవాత “కామెడీ స్టార్స్ ” ఆ హంగామాని కొనసాగిస్తుంది. ప్రేక్షకులు ఎంతో అభిమానించే సెలెబ్ టీమ్స్ మధ్య వినోదాత్మకమైన పోటీ గ్యాప్ ఇవ్వకుండా నవ్విచబోతోంది. యాంకర్ వర్షిణి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో 3 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం మీద ఆదివారం మధ్యాహ్నం స్టార్ మా ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని మిగల్చబోతోంది.
ఆదివారం అవుతుంది అద్భుత వారం అనే ఆలోచనతో ఈ నెల 31 (ఆదివారం ) నుంచి ఈ రెండు షో లు స్టార్ మా లో ప్రారంభం అవుతున్నాయి.
స్టార్ట్ మ్యూజిక్ & కామెడీ స్టార్స్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Press release by: Indian Clicks, LLC