ఎన్టీఆర్ తో ఇప్పుడే కాదు!

NTR

“ఖైదీ” డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ సినిమాలపై వివరణ ఇచ్చాడు. విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” సినిమా విడుదలయిన వెంటనే రజినీకాంత్ తో ఒక మూవీ, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కానీ, పవన్ కళ్యాణ్ తో కానీ మరో మూవీ అని ప్రచారం జరుగుతోంది. లోకేష్ కి ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ అడ్వాన్స్ ఇచ్చింది అన్న విషయాన్ని తెలుగుసినిమా.కామ్ ఇటీవల బయట పెట్టింది.

“తెలుగు సినిమాలు అంటే ఇష్టమే. తెలుగులో చెయ్యాలని ఉంది. మంచి ఆఫర్లు కూడా వచ్చిన మాట వాస్తవమే. కానీ ఏది ఇంకా సైన్ చెయ్యలేదు. ఒక దాని తర్వాత ఒకటి ఒప్పుకోవాలనేది నా ప్లాన్. మాస్టర్ విడుదలైన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుతా,” అని బాలీవుడ్ వెబ్ సైట్ కిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు ఈ కుర్ర దర్శకుడు.

ఎన్టీఆర్ లైనప్ ప్రస్తుతం టైట్ గా ఉంది. రాజమౌళి తీస్తున్న “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ ఇంకా చాలా ఉంది. అది పూర్తి కావాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మూవీ ఉంది. ఈ రెండూ పూర్తి అయ్యేసరికి 2022 వస్తుంది. అప్పటి పరిస్థితులని బట్టి ఏ మూవీస్ చెయ్యాలి అనేది డిసైడ్ చేస్తాడు.

Related Stories