సుశాంత్ బండి బయటికి తీస్తున్నాడట

- Advertisement -


కరోనా రెండో వేవ్ కారణంగా అనేక చిన్న చిత్రాలు షెడ్డుకు వెళ్లాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగవ్వడంతో గ్యారేజ్ నుంచి బయటికి వస్తున్నాయి చిన్న చిత్రాల బండ్లు. ఆ లైన్లో సుశాంత్ ఉన్నారు.

“మనమందరం చాలా కాలం ఓపిగ్గా వెయిట్ చేశాం. కానీ ఇప్పుడు మళ్ళీ బైక్ స్టార్ట్ చెయ్యాల్సిన టైం వచ్చింది,” అని అంటున్నారు సుశాంత్.

“చి ల షౌ”, “అల వైకుంఠపురంలో” చిత్రాలతో సుశాంత్ మంచి విజయాలు చూశారు. ఆ ఊపులో హీరోగా ఒక చిన్న చిత్రాన్ని ఏడాదిన్నర క్రితం  మొదలుపెట్టారు. ఆ సినిమా పేరు…. “ఇచట వాహనములు నిలుపరాదు”. పేరుకి తగ్గట్లే ఈ సినిమా చాలాకాలం పార్కింగ్ లో ఉండిపోయింది. కరోనా వల్ల యిబ్బంది పడ్డ చిత్రం ఇది.

ఇక ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాని విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు సుశాంత్. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న మీనాక్షి చౌదరి ఇప్పటికే రెండు సినిమాలు కూడా పూర్తి చేసింది. రవితేజ సరసన “ఖిలాడీ” సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో మరో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ముందు విడుదల అవుతుందా? లేక “ఖిలాడీ”నా అన్నది చూడాలి.

 

More

Related Stories