సుధా కొంగర నెక్స్ట్ మూవీ ఏంటి?

Sudha Kongara

లేడీ డైరెక్టర్ అనగానే చిన్న సినిమాలు, రొమాంటిక్ చిత్రాలు తీస్తారని ఎక్ప్ పెక్ట్ చేస్తారు. దాన్ని బ్రేక్ చేశారు సుధా కొంగర. 50 ఏళ్ల ఈ దర్శకురాలు… చెన్నైలో పెరిగిన తెలుగు వ్యక్తి. ఆమె తీసిన తాజా చిత్రం “ఆకాశం నీ హద్దు రా” మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఓటిటిలో ఒక సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అయిందంటే అది బాడ్ మూవీ అయి ఉంటుంది అనే అభిప్రాయం బలపడుతున్న టైములో విడుదల అయిన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది.

సూర్యలాంటి పెద్ద స్టార్ ని బాగా హ్యాండిల్ చేసి పేరు తెచ్చుకున్నారు సుధా కొంగర. ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాపై అందరి కళ్ళు పడ్డాయి. ఇంతకుముందు తెలుగులో వెంకటేష్ తో “గురు” చిత్రాన్ని తీశారు.

నెక్స్ట్ మూవీ విజయ్ తో కానీ, కమల్ హాసన్ తో కానీ ప్లాన్ చేస్తున్నారట. అలాగే, తెలుగులో కూడా ఒక స్ట్రెయిట్ మూవీ కోసం కథ రెడీ చేసుకుంటున్నారు అని టాక్.

Related Stories