పెద్ద ప్రయోగం చేస్తున్న సుధీర్ బాబు

కెరీర్ లో సుధీర్ బాబు చాలా రోల్స్ పోషించాడు. అర్బన్ అబ్బాయిగా, కోనసీమ కుర్రాడిగా, సిన్సియర్ పోలీసాఫీసర్ గా, పక్కింటబ్బాయిగా.. ఇలా చాలా వేషాలు వేశాడు. అయితే ఇప్పటివరకు సుధీర్ బాబు పోషించిన పాత్రలు ఒకెత్తు, త్వరలోనే అతడి నుంచి రాబోతున్న సినిమాలో పాత్ర మరో ఎత్తు అంటున్నారు సినీ జనాలు.

హర్షవర్థన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాకు మామా మశ్చీంద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నాడని… దర్శకుడు హర్షవర్ధన్ మునుపెన్నడూ చూడని మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో సుధీర్ బాబుని చూపించబోతున్నాడని ఇప్పటికే మేకర్స్ ఊదరగొడుతున్నారు.

అయితే ఇదేదో సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు, అందరూ కామన్ గా చెప్పినట్టు చెప్పే వాక్యాలు కావు. ఇందులో నిజంగానే సుధీర్ బాబు, తన పాత్రతో మేజిక్ చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, సుధీర్ ఇందులో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మామా మశ్చీంద్ర అనే టైటిల్ వందశాతం సూట్ అవుతుందని చెబుతున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒకేసారి తెలుగు-హిందీ భాషల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు.

 

More

Related Stories