సుధీర్ నైట్రో స్టార్ అంట!

Sudheer Babu


హీరోలకు బిరుదులు ఇవ్వడంలో దక్షిణ భారత చిత్రసీమ రూటే సెపరేట్. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగా పవర్ స్టార్, మెగా ప్రిన్స్, సుప్రీం హీరో, దళపతి, లోకనయగన్, తలైవా, తల, యంగ్ టైగర్, యువ సామ్రాట్, నేచురల్ స్టార్, మాస్ మహారాజా, నటసింహం, విక్టరీ, కింగ్…. ఈ లిస్ట్ కి అంతే లేదు. ప్రతి హీరోకి ఒక ట్యాగ్ ఉంది.

ఈ పేర్లని చూసే కామెడీగా సంపూ తనకి తాను బర్నింగ్ స్టార్ అని పెట్టుకున్నాడు.

ఇప్పుడు మరో హీరో సుధీర్ బాబుకి నిర్మాతలు కొత్త పేరు తీసుకొచ్చారు. ఇతనికి ‘నైట్రో స్టార్’ అనే ట్యాగ్ అతికించారు. అంటే నైట్రోజన్ బాంబులా మండుతాడన్నమాట. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా మేకర్స్ ఈ పేరు ఇచ్చారు సుధీర్ బాబుకి. మరి ఇది సినిమాలో ఏదైనా కామెడీ బిట్టా. నిజంగా వాళ్లు అలా ఫీల్ అయ్యి చేశారా అనేది తెలియదు.

ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు. అలా శుభాకాంక్షలు తెలిపారు.

 

More

Related Stories