జిమ్ చేస్తూ డాన్స్ చేసిన మశ్చీంద్ర

హీరో సుధీర్ బాబు వ్యాయామాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. బాడీ మెయింటెనెన్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు ఈ హీరో. రోజులో కనీసం 4-5 గంటలు జిమ్ లోనే గడిపేస్తుంటాడు.

ఇక ఈ హీరో డాన్స్ లో కూడా పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో డాన్స్ బాగా చేసే హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకడు. తన ప్రతి సినిమాలో మంచి డాన్స్ మూమెంట్స్ చూపిస్తుంటాడు ఈ హీరో.

ఇప్పుడీ హీరో తన జిమ్ ను, డాన్స్ ను కలిపి మిక్స్ చేశాడు. ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మామా మశ్చీంద్ర సినిమాలోనిది కావడం విశేషం.

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన మామగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ వీడియో రిలీజ్ చేశాడు సుధీర్ బాబు. బార్ పట్టుకొని ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టుండే ఈ డాన్స్ మూమెంట్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. సుధీర్ బాబు ఫిట్ నెస్ ను మరోసారి ఎలివేట్ చేసింది ఈ వీడియో. హర్షవర్థన్ ఈ సినిమాకు దర్శకుడు.

 

More

Related Stories