‘వి’ కథ ఇదే: సుధీర్ బాబు

V Movie

నాని, సుధీర్ బాబు నటించిన “V” సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇందులో నాని నెగెటివ్ షేడ్ లో కనిపించబోతున్నాడనే విషయం ట్రయిలర్ లో స్పష్టంగా ఉంది. మరోవైపు నాని క్యారెక్టర్ లో చిన్న సర్ ప్రైజ్ ఉందంటూ హీరోయిన్ నివేథ థామస్ ఊరిస్తోంది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు సుధీర్ కూడా రియాక్ట్ అయ్యాడు.

“V” సినిమా కథను తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ హీరో. ఇందులో హీరో-విలన్ అంటూ ఎవ్వరూ ఉండరంటున్నాడు సుధీర్. రెండు బలమైన పాత్రలు మాత్రమే ఉంటాయంటున్నాడు. తాము చేసింది మాత్రమే కరెక్ట్ అని నమ్మే, రెండు బలమైన క్యారెక్టర్ల మధ్య యుద్ధమే V సినిమా కథ అంటున్నాడు. పేరుకు ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఉన్నప్పటికీ.. చాలా పెద్ద డ్రామా ఉంటుందని చెబుతున్నాడు.

అయితే ఇక్కడ కూడా సుధీర్ బాబు, నివేథ థామస్ తరహాలోనే స్పందించాడు. సినిమాలో విలన్ ఎవ్వరో చెప్పడానికి అంగీకరించలేదు. మరో 6 రోజుల్లో సినిమా వస్తోంది కదా.. చూసి మీరే తెలుసుకోండి అంటున్నాడు. రాక్షసుడు, రక్షకుడు మధ్య జరిగే యుద్ధంగా ఈ సినిమాను చెబుతున్న సుధీర్ బాబు.. రాక్షసుడు ఎవరనే విషయాన్ని బయటపెట్టలేదు.

Related Stories