సుధీర్ బాబుకి బొప్పి!

సుధీర్ బాబు హీరోగా ఒక మెట్టు ఎక్కాలని చేస్తున్న ప్రయత్నాలు అసలు ఫలించడం లేదు. కరోనా టైంలో నానితో కలిసి నటించిన ‘వి’ డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైంది. అది పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫ్లాప్ అయింది. లేటెస్ట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అదే బాపతు.

ఇంద్రగంటి డైరెక్షన్ లో సుధీర్ బాబు నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’కి చెప్పుకోదగ్గ ఓపెనింగ్ కూడా రాలేదు. ఈ సినిమాతో ఆయనకి ఓపెనింగ్ కూడా రాబట్టే సత్తా లేదని అర్థమైంది. ఇక సోలో హీరోగా సుధీర్ బాబు మార్కెట్ బాగా పడిపోయినట్లే.

కృతి శెట్టిలాంటి హీరోయిన్ ఉన్నా కూడా ఈ సినిమాకి ఓపెనింగ్ రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ కి సినిమా పుంజుకునే అవకాశం కూడా లేదు. రివ్యూస్ అన్నీ బ్యాడ్ గానే వచ్చాయి.

సుధీర్ బాబు అటు యాక్షన్ హీరో కాకుండా, ఇటు రొమాంటిక్ హీరో కాకుండా అయిపోయాడు.

Advertisement
 

More

Related Stories