మహేష్ తో నటించాలనేది కోరిక: సుధీర్

- Advertisement -
Sudheer Babu

హీరో సుధీర్ బాబు హీరో అయి పదేళ్లు అయింది. ‘శివ మనసులో శృతి’ అనే చిత్రంతో అడుగుపెట్టాడు. త్వరలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో మన ముందుకు రానున్నాడు. పదేళ్ల కెరీర్ సంతృప్తిని ఇచ్చింది అంటున్నాడు. సుధీర్ బాబు బావ మహేష్ బాబు సూపర్ స్టార్. కానీ ఇంతవరకు మహేష్ బాబుతో నటించలేదు.

మహేష్ బాబుని ఎప్పుడూ తానూ ఫేవర్ అడగలేదు అంటున్నారు సుధీర్. “కాకపోతే మహేష్ నుంచి చాలా నేర్చుకున్నాను. మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలనేది కోరిక. ‘ప్రేమ కథా చిత్రమ్’ విడుదలైనప్పుడు మహేష్ న‌న్ను చాలా మెచ్చుకున్నారు,” అని చెప్పారు సుధీర్.

“నా బెస్ట్ క్రిటిక్ నా భార్యే. స్నేహితులుకూడా కొన్ని సూచ‌న‌లు చేస్తుంటారు. మీడియాలోనూ కొంద‌రు వున్నారు,” అని అంటున్నారు సుధీర్.

సుధీర్ హీరోగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని ఐదేళ్ల క్రితం ప్రకటించారు. ఇంతవరకు మొదలు కాలేదు. “ఒక పెద్ద సంస్థ ముందుకు వ‌చ్చింది. త్వ‌ర‌లో సెట్ పైకి వెళ్ళ‌బోతోంది,” అని క్లారిటీ ఇచ్చారు.

 

More

Related Stories