కృష్ణగారు ‘హంట్’ చూస్తారనుకున్నా!


సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’ జనవరి 26న విడుదల కానుంది. ఇందులో ఆయన మెమొరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు.

“ఈ సినిమాలో నేను ఎవరిని ‘హంట్’ చేస్తున్నాను అనేది సస్పెన్స్. సినిమా చివరి వరకు ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఫ్రెష్ గా ఉండాలని ‘జాన్ విక్’ సినిమాలను రిఫరెన్స్ తీసుకున్నాం. ఐతే యాక్షన్ ఎంత వరకు ఉండాలో అంతే ఉంటాయి. ప్రధానంగా ఎమోషన్స్ పైనే నడుస్తుంది మూవీ,” అని ‘హంట్’ విశేషాలు మీడియాకి తెలిపారు సుధీర్.

హీరోయిన్ ఎందుకు లేదు? “ఇందులో లవ్ ట్రాక్ లేదు. ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది,” అని చెప్పారు.
 
ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకోవడానికి కారణం ఏంటి? “ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజులుగా వాళ్ళను ఫాలో అవుతున్నాను. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని అప్రోచ్ అయ్యాను. తర్వాత తెలిసింది వాళ్ళు సినిమాలకు యాక్షన్ సీక్వెన్సులు చేస్తారని. సో, ఒక ఫైట్ వారితో చేయిద్దామని మొదలు పెట్టాము. కానీ ఎక్కువ అయ్యాయి. స్టంట్స్ పరంగా కొత్తగా చేశాం,” అన్నారు సుధీర్.

సుధీర్ బాబు… సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు. తన మామగారు ఈ సినిమా చూస్తారని అనుకున్నారట సుధీర్. “కృష్ణ గారంటేనే డేరింగ్. సాహసాలు, కొత్తగా చెయ్యడం ఆయన స్టయిల్. అందుకే, నేను కొత్తగా ట్రై చేసిన ‘హంట్’ ఆయన చూడాలని అనుకున్నాను. ఆయన ‘హంట్’ చూడకుండానే కన్నుమూశారు. ఆయన మన మధ్యలో లేకపోవడంతో వెలితిగా ఉంది,” అన్నారు.

 

More

Related Stories