స్ఫూర్తినిచ్చే సుధీర్ హార్డ్ వర్క్

Sudheer Babu

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కొచ్చింది. సినిమాకి వచ్చిన రివ్యూస్ పక్కన పెడితే… సుధీర్ బాబు బాగా హైలైట్ అయ్యాడు. ఒక మాస్ హీరోకి ఎలాంటి ఇంట్రడక్షన్ దక్కుతుందో అలాంటిది దక్కింది కండలవీరుడు అనిపించుకున్నాడు. ఈ సినిమాతో సుధీర్ బాబు మరింత గెయిన్ అవుతాడు. మనకి ఒక మంచి యాక్షన్ హీరో దొరికాడు అనిపించింది సినిమా చూశాక.

ఐతే, ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడట. షూటింగ్ కి ముందు మోకాలు గాయం. కానీ, అనేక ఫిజియో థెరపీలతో బలం పెంచుకున్నాడు. అదెలా జరిగిందో… చాలా మోటివేషనల్ గా ఉన్న ఒక వీడియోను షేర్ చేశాడు సుధీర్ బాబు.

ఇక ఫాన్స్ అందరూ మహేష్-సుధీర్ బాబు కలిసి నటిస్తే చూడాలని వెయిటింగ్. అయితే దానికింకా టైమ్ పట్టేలా ఉందంటున్నాడు సుధీర్ బాబు.

“ఇద్దరం కలిసి సినిమా చేయాలని నేను-మహేష్ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ కథ బాగుండి, ఇద్దరికీ సెట్ అవుతుందనుకుంటే కచ్చితంగా చేస్తాం. మహేష్ తో కలిసి నటించడం అభిమానులకే కాదు, నాక్కూడా చాలా ఇష్టం. మంచి స్క్రిప్ట్ దొరికితే కచ్చితంగా మహేష్ తో సినిమా చేస్తా. ఆరోజు కోసం వెయిటింగ్,” అంటున్నాడు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో మహేష్ ను కలిసి చాలా రోజులైందంటున్నాడు సుధీర్. ‘V’ సినిమాపై మహేష్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపాడు. “నా సినిమాలకు సంబంధించి మహేష్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటాను. కాకపోతే లాక్ డౌన్ వల్ల మహేష్ తో ఈమధ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. V ట్రయిలర్ చూసి యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయని చెప్పారు. సినిమాపై మహేష్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నా,” అని చెప్పాడు సుధీర్ బాబు.

Related Stories