రిలీజ్ కు ముందే డైరెక్టర్, నిర్మాత ఫైట్!


రెజీనా, నివేధ థామస్ నటించిన చిత్రం… శాకిని డాకిని. వీరు ఇద్దరూ పోలీసు అధికారులుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘ఓ బేబి’ ఫేమ్ సునీత తాటి నిర్మాత. ఈ వీకెండ్ సినిమా థియేటర్లలోకి రానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడినా ఇప్పటివరకు సుధీర్ వర్మ సినిమా ప్రొమోషన్ లకు రావడం లేదు. ఎందుకంటే, ఈ సినిమా నిర్మాతకు, సుధీర్ వర్మకి గొడవ జరిగిందిట. సుధీర్ వర్మ సినిమా మొత్తం తీసి నిర్మాతకు అప్పగించి రవితేజతో ‘రావణాసుర’ అనే సినిమా మొదలుపెట్టాడు. ఐతే, రీసెంట్ గా మరో 15 రోజుల పాటు రీషూట్ చెయ్యాలని నిర్మాత సుధీర్ వర్మకి కబురు పెట్టారట. ఒకేసారి 15 రోజుల డేట్స్ అంటే తాను ఇవ్వలేనని సుధీర్ వర్మ చెప్పారు. రవితేజ సినిమా ఉంది కాబట్టి తనకి ఒకేసారి 15, 20 రోజుల పాటు మళ్ళీ పని చెయ్యడం అంటే కుదరదు అని చెప్పాడట.

ఆ విషయం అలా నలుగుతుండగానే నిర్మాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసే విడుదల తేదీ ప్రకటించారు. ట్రైలర్, టీజర్ కూడా నిర్మాతలే కట్ చేసుకున్నారట.

దాంతో, సుధీర్ వర్మ ఈ సినిమా ప్రమోషన్ల ముఖం చూడడం లేదు.

 

More

Related Stories