సుధీర్, ఆది నిజంగానే వదిలేశారా?

కొన్నాళ్లుగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కనిపించడం లేదు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. అలా అని వాళ్లు పూర్తిగా సైడ్ అయిపోలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. అది మల్లెమాల వారి  కార్యక్రమమే, ఇది కూడా మల్లెమాల ప్రొడక్షన్ కార్యక్రమమే. కానీ జబర్దస్త్ లో వీళ్లు లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

దాదాపు 9 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ షోకు ఇప్పుడు రేటింగ్స్ తగ్గిపోయాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వెళ్లిన తర్వాత రేటింగ్ ఇంకా దిగజారింది. ఈ క్రమంలో వీళ్ల బెస్ట్ ఫ్రెండ్ ఆటో రామ్ ప్రసాద్ ఒకింత భావోద్వేగానికి కూడా గురయ్యాడు. ఫ్రెండ్స్ లేని జబర్దస్త్ ను ఊహించలేకపోతున్నానంటూ ఆమధ్య ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పరిస్థితేంటి? వాళ్లు నిజంగానే జబర్దస్త్ కు దూరమయ్యారా? లేక కొన్నాళ్లు ఆగి మళ్లీ వస్తారా?

జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించి మల్లెమాల సంస్థతో వీళ్లిద్దరి కాంట్రాక్ట్ ముగిసింది. అలా అని కాంట్రాక్ట్ ముగిసిన  వెంటనే బయటకు వెళ్లే ఉద్దేశం కూడా వీళ్లకు లేదు. మల్లెమాల సంస్థనే కాస్ట్ కటింగ్ లో భాగంగా వీళ్లిద్దర్నీ ఈ కార్యక్రమం నుంచి దూరం పెట్టినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ లో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న వీళ్లిద్దరూ లేకుండా షోను నడిపి ఫలితం చూడాలనుకుంటోందంట ఈ సంస్థ. రేటింగ్స్, రెవెన్యూ తగ్గితే తిరిగి భారీ పారితోషికానికి వాళ్లను వెనక్కు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతానికైతే వీళ్లిద్దరూ ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో బిజీగా ఉన్నారు. మళ్లీ వాళ్లు ఎప్పుడు జబర్దస్త్ వేదికపైకి వస్తారు.. ఎప్పుడు తమ ఫ్రెండ్ ఆటో రామ్ ప్రసాద్ ను కలుసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

More

Related Stories