సుడిగాలి సుధీర్ కు కరోనా

మరో టీవీ ఆర్టిస్టుకు కరోనా సోకింది. పాపులర్ టీవీ సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో మరోసారి టీవీ జనాలంతా ఉలిక్కిపడ్డారు. దీనికి ఓ కారణం ఉది.

కొన్ని రోజుల కిందట ఈటీవీకి “అక్కా ఎవరే అతగాడు” అనే స్పెషల్ షో చేశాడు సుధీర్. దసరా స్పెషల్ గా రాబోతున్న ఈ కార్యక్రమంలో వీళ్లు వాళ్లు అనే తేడాలేకుండా సెలబ్రిటీస్ అంతా పాల్గొన్నారు. సుడిగాలి సుధీర్ తో పాటు ఆటో రామ్ ప్రసాద్, సంగీత, గెటప్ శీను, రష్మి, వర్షిని, నవదీప్ పాల్గొన్నారు. వీళ్లతో పాటు జబర్దస్త్, ఢీ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఇలాంటి ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత సుడిగాలి సుధీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే ఆయన హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడు అతడితో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లంతా కంగారు పడుతున్నారు. ప్రస్తుతం సుధీర్ తను చేయాల్సిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు.

ఇదే కార్యక్రమంలో ఎప్పట్లానే రష్మితో ఓ డ్యూయెట్ కూడా వేసుకున్నాడు సుడిగాలి సుధీర్. కాబట్టి రష్మిపై కూడా ఇప్పుడు అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే తనకు కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని సుడిగాలి సుధీర్ ఇప్పటివరకు నిర్థారించలేదు.

Related Stories