ఇక హీరోగానే కంటిన్యూ

Suhaas

చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఇప్పుడు హీరోగా స్థిరపడ్డాడు సుహాస్. హీరోగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. దాంతో ఇప్పుడు పూర్తిగా తనపై తనకు నమ్మకం వచ్చిందట.

ఇటీవల విడుదలైన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” ఘన విజయం సాధించలేదు. కానీ ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగానే ఆడింది. కానీ ఈ సినిమా తర్వాత హీరోగా తాను నిలబడినట్లు ఆయనకి నమ్మకం కలిగిందిట.

కమెడియన్ గా అనేక చిత్రాల్లో కనిపించాడు సుహాస్. ఆ తర్వాత “హిట్ 2” వంటి చిత్రాల్లో విలన్ గా నటించాడు. “కలర్ ఫోటో” చిత్రంతో లీడ్ హీరో అయ్యాడు. ఆ తర్వాత “రైటర్ పద్మభూషణ్”తో హీరోగా మొదటి థియేటర్ విజయం అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు చిత్రాలు విడుదల కావడంతో ఇక హీరోగానే కంటిన్యు అవ్వాలని ఫిక్స్ అయ్యాడట.

ప్రస్తుతం సెట్ పై రెండు చిత్రాలు ఉన్నాయి. అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఒక చిత్రం తీస్తున్నారు సుహాస్ తో.

Advertisement
 

More

Related Stories