- Advertisement -

కమెడియన్ నుంచి హీరోగా ఎదిగాడు సుహాస్. వరుసగా ఇప్పుడు హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. “కలర్ ఫోటో”, “రైటర్ పద్మభూషణ్”, “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమాల తర్వాత హీరోగా మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.
తాజాగా “ప్రసన్న వదనం” అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో కిస్ సీన్ కూడా చేశాడట.
“ఇప్పటివరకు లిప్ లాక్ సీన్లు చెయ్యలేదు. ఈ సినిమాలో అది కూడా జరిగింది,” అని చెప్పాడు సుహాస్. ఐతే మరీ ఓవర్ గా ముద్దు సీన్లను ఊహించుకోవద్దు అంటున్నాడు. కథ ప్రకారం వచ్చే చిన్న లిప్ లాక్ అన్నమాట.
హీరోగా అన్ని వెరైటీ చిత్రాలు చేసేందుకే ప్రయత్నిస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు.