
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా మరవకముందే… ముంబైలో మరో ఇద్దరు నటుల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. నిన్న ఒక టీవీ నటుడు సూసైడ్, నేడు ఒక భోజపురి నటి ఆత్మహత్య. భోజ్ పూరి సినిమాల్లో నటించే అనుపమ పాఠక్ (40) ఆర్థిక కారణాలతో సూసైడ్ చేసుకుంది. చనిపోయే ముందు ఏకంగా ఎఫ్బీలో లైవ్ చాట్ చేసింది. తన కష్టాలను అందరికి చెప్పింది. గుడ్ నైట్ అని చెప్పి నైట్ బలవన్మరానికి పాల్పడింది.
అంతకుముందు సమీర్ శర్మ (44) కూడా ఉరేసుకున్నాడు. పలు టీవీ సీరియల్స్ లో నటించిన సమీర్ శర్మ ఆత్మహత్యకి కారణాలు తెలియరాలేదు.
సుశాంత్ సింగ్ రాజపుత్, సమీర్ శర్మ, అనుపమ…. అందరూ ఒంటరితనంతో బాధపడుతున్నవారే. వారికి ఇంతకుముందే కొన్ని సమస్యలున్నాయి కానీ ఈ కరోనా లాక్డౌన్ లో అవి పెద్ద సమస్యలుగా అనిపించి ఆత్మహత్యకి పాల్పడేలా చేసి ఉంటాయని మానసిక వైద్యులు అంటున్నారు.