ఏ రీమేక్ చెయ్యట్లేదు: సుజీత్

యువ దర్శకుడు సుజీత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ బాధ్యత మొదట సుజీత్ కే అప్పచెప్పి, ఆ తర్వాత వినాయక్ కి ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరూ ఆ రీమేక్ డైరెక్ట్ చెయ్యట్లేదు. అలాగే, “ఛత్రపతి” హిందీ రీమేక్ కూడా చెయ్యాల్సిందిగా బాలీవుడ్ నిర్మాతలు సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. ఐతే అది కూడా చేయట్లేదు.

“ఏ రీమేక్ చెయ్యట్లేదు,” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పోస్ట్ చేశాడు. ఆలా అన్ని ఊహాగానాలకు తెరదించాడు. లూసిఫర్ రీమేక్ కానీ, ఛత్రపతి రీమేక్ కానీ తీయడం లేదని ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

“రన్ రాజా రన్” సినిమాతో ఫేమ్ లోకి వచ్చాడు సుజీత్. ఆ తర్వాత “సాహొ” సినిమాతో పేరు మార్మోగింది. ఐతే, ఆ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలవడంతో పెద్ద హీరోలు ఎవరూ అతన్ని పిలిచి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే తన నెక్స్ట్ సినిమాతో మళ్ళీ తన సత్తా ఏంటో చూపాలని కసిగా ఉన్నాడు ఈ న్యూలీ మ్యారీడ్ డైరెక్టర్.

Related Stories