కన్నీళ్లు పెట్టుకున్న బన్నీ, సుక్కు

- Advertisement -
Sukumar and Allu Arjun

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా “థ్యాంక్ యూ” మీట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. సుకుమార్ తన సినిమాకి పనిచేసిన వారందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పారు. మొత్తం స్పీచ్ లో అనేకసార్లు ఎమోషనల్ గా మారిపోయారు. లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ కి, ఇతర వర్కర్స్ కి తలా లక్ష రూపాయల ఇస్తానని చెప్పారు సుకుమార్.

అలాగే పాటల రచయిత చంద్రబోస్ కి పాదాభివందనం చేయడం విశేషం. ఇక అల్లు అర్జున్ ని దేవుడితో పోల్చారు.

“అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. యాక్టర్ గా అతను వీవర్ అఫ్ ఎమోషన్స్. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు,” అని అన్నారు. అల్లు అర్జున్ కూడా స్టేజిపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

“సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్య లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను,” అని ఏడ్చేశారు అల్లు అర్జున్.

 

More

Related Stories