- Advertisement -

సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద చిన్న సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు అందించారు. అందులో ‘కుమారి 21 ఎఫ్’, ‘ఉప్పెన’ పెద్ద హిట్ అయ్యాయి. వేరే సంస్థలతో చేతులు కలిపి సుకుమార్ తన అసిస్టెంట్ లను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సినిమాలు తీస్తున్నాడు.
తాజాగా మరో సినిమా ప్రకటించాడు. కార్తికేయ హీరోగా ఈ సినిమా ఉంటుందట. నవంబర్ లో సినిమా లాంచ్ అవుతుంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తారట. ఐతే సుకుమార్ తరపున విడుదల చేసిన ప్రెస్ నోటులో దర్శకుడు పేరు ప్రకటించలేదు.
వచ్చే వారం విడుదల కాబోతున్న కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమాకి హైప్ వచ్చేందుకు సుకుమార్ ఇలా ప్రకటించాడా లేక నిజంగానే తీస్తాడా అన్నది చూడాలి.