కూతురు కోసం షూటింగ్ నిలిపివేత

Sukumar and Allu Arjun

సుకుమార్ కూతురికి సంబంధించిన ఒక ఫంక్షన్ ని ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక క స్టార్ హోటల్ దీనికి వేదిక. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యే ఈ ఫంక్షన్ కోసం ఒక రోజు షూటింగ్ ని నిలిపివేశాడు సుకుమార్. సాధారణంగా సుకుమార్ ఇలాంటి సొంత ఫంక్షన్లు ఉంటే వారం పాటు సెలవు తీసుకుంటారు. ఐతే, ఆయన ఇప్పుడు మారారు. షూటింగ్ ని స్పీడ్ గా తీసేందుకు కట్టుబడి ఉన్నారు. అందుకే, ఈ ఫంక్షన్ కోసం ఒక రోజు మాత్రమే బ్రేక్ ఇచ్చారట.

‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల కానుంది. ఆ టైం మిస్ కావొద్దని అల్లు అర్జున్, నిర్మాతలు సుకుమార్ వద్ద మాట తీసుకున్నారు. సుక్కు కూడా అదే దీక్షలో ఉన్నారనేది టాక్.

ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గానే జరుగుతోంది మరి. ఈ సినిమాకి ఏప్రిల్, మే నెలల్లో జరిగే షూటింగ్ కీలకం. ఆ షెడ్యూల్ అనుకున్నట్లు పూర్తి చేస్తే… సినిమా విడుదల పోస్ట్ పోన్ ఉండదు. మే నెలాఖరుకు 90 శాతం షూటింగ్ పూర్తి అయ్యేలా షెడ్యూల్స్ రెడీ చేశారు మరి.

More

Related Stories