ఈ బ్యూటీకి సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?

Ananya Nagalla

అనన్య నాగళ్ళ. ఈ పేరు చాలా మందికి తెలియదు. కానీ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి పరిచయమే. ‘మల్లేశం’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ప్రసంశలు అందుకొంది. రీసెంట్ గా ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో కనిపించింది. వచ్చే నెలలో ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో ఆమె ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఈ సినిమా ఆమెని పాపులర్ చెయ్యడం గ్యారెంటీ.

ఇటీవల ఆమె నటనని చూసి దర్శకుడు సుకుమార్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. అచ్చ తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అని అన్నాడు సుకుమార్. అనన్య నటన సూపర్ గా ఉందని, హైదెరాబాదీ అమ్మాయి కాబట్టి తప్పకుండ తన నెక్స్ట్ మూవీ లో ఛాన్స్ ఇస్తా అని అంటున్నాడు.

మరి సుకుమార్ నిజంగా ఛాన్స్ ఇస్తాడా అన్నది చూడాలి.

More

Related Stories