
దర్శకుడు సుకుమార్ పెర్ఫెక్షనిస్ట్. తన ఊహకు అనుగుణంగా సినిమా ఉండాలని చివరివరకు ప్రయత్నిస్తారు సుకుమార్. క్వాలిటీ విషయంలో రాజీపడే తత్వం కాదు. “పుష్ప” సినిమా విషయంలో కూడా తగ్గేదే లే అంటున్నారు. ఐతే, ఈ సినిమా విడుదల సమయంలో ఆయన పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు.
సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. కానీ సినిమా మిక్సింగ్ కోసం ముంబైలో ఉండిపోయారు. రేపటికి మొత్తం అన్ని పనులు పూర్తి అయిపోతాయి. రెలీజ్ కి నాలుగు రోజుల ముందు వరకు ఆయన “ఫైన్ ట్యూన్” చెయ్యాల్సి వచ్చింది. డిసెంబర్ 17కి బదులు డిసెంబర్ 24కో, లేక ఫిబ్రవరి 2020లోనే విడుదల చేద్దామని సుకుమార్ ప్రతిపాదించారు. ఎందుకంటే, టెన్షన్ లేకుండా తాను పని చేసుకోవచ్చు అని. కానీ అల్లు అర్జున్ ఒప్పుకోలేదు.
ఈ డేట్ మిస్ అయితే మళ్ళీ సరైన డేట్ దక్కుతుందో లేదో అని బన్నీ బాధ. ఈ కరోనా కాలంలో చెప్పిన డేట్ కి విడుదల చెయ్యడమే బెటర్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు అనేది బన్నీ భయం కావొచ్చు. దాంతో, అల్లు అర్జున్ ఈ డేట్ విషయంలో పట్టుపట్టారు. సో, సుకుమార్ చివరి నిమిషం వరకు అని చెయ్యక తప్పట్లేదు.
ఐతే, ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా ఉండేలా ఉన్నాయి. చివర్లో భారీ హైప్ వచ్చింది ‘పుష్ప’కి.