‘జగడం’ రీమేక్ చెయ్యాలని ఉంది!

Sukumar and Ram


దర్శకుడు సుకుమార్ ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే సెన్సషనల్ హిట్. దిల్ రాజు నిర్మాత, అల్లు అర్జున్ హీరో. దాంతో అదే కాంబినేషన్లో రెండో సినిమా మొదలు పెట్టాలని అంతా రెడీ చేశాడు దిల్ రాజు. కానీ దిల్ రాజుకి, సుకుమార్ కి కథ విషయంలోనో, మరో మేటర్లోనో విభేదాలు వచ్చాయి. దాంతో సుకుమార్ రాత్రికి రాత్రి రామ్ హీరోగా ‘జగడం’ అనే సినిమాని ప్రారంభించాడు. దిల్ రాజు ప్రొడక్షన్ మళ్ళీ ఇప్పటివరకు సినిమా చెయ్యలేదు సుకుమార్.

‘జగడం’ అట్టర్ ప్లాప్ అయింది. ఐతే 14 ఏళ్ల తర్వాత … ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని ఉంది అని అంటున్నాడు సుకుమార్. ఇప్పుడు అయన దర్శకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు.

“ఈ సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని చిన్న బాధ ఉంది నాలో. రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ… రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. ఇప్పటి రామ్ తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది,” అని లేటెస్ట్ గా చెప్పాడు సుకుమార్.

‘జగడం’ సినిమా విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

More

Related Stories