సుకుమార్ రైటింగ్ రేటు హాట్

Sukumar

దర్శకుడు సుకుమార్ తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఆయన తన శిష్యులు తీసే సినిమాలకు ‘ప్రెజంటర్’గా, స్క్రీన్ ప్లే రైటర్ గా ఉంటూ వస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’, ‘దర్శకుడు’, ‘ఉప్పెన’ అనే మూడు చిత్రాలు అలా అందించారు సుకుమార్. అందులో ‘దర్శకుడు’ తప్ప మిగతా రెండూ పెద్ద హిట్స్.

ఇప్పుడు ఆయన ’18 పేజెస్’ అనే సినిమాకి కూడా ‘రైటింగ్స్’ అని వేసుకుంటున్నారు. ఇది విడుదలైన తర్వాత ఆయన ‘రైటింగ్స్’ అని ముద్ర కావాలంటే భారీగా అందించాలని అడుగుతున్నారని టాక్. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తీసే నెక్స్ట్ సినిమాకి కూడా సుకుమార్ రైటింగ్స్ ‘ట్యాగ్’ ఉంటుంది. ఐతే, హీరో ఎవరు అనేది ఇంకా తేలలేదు.

మరి విజయాల శాతం ఆ రేంజులో ఉన్నప్పుడు అడగడం తప్పు లేదులెండి.

 

More

Related Stories