అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో!

Sukumar


సుకుమార్ ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు అని, సుకుమార్ ఇంకో పదేళ్లు ఖాళీ లేకుండా సినిమాలు ఒప్పుకున్నాడు అని వండిన వార్తలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్, ప్రభాస్ తో సినిమా చేస్తే చెయ్యొచ్చు. అది పెద్ద విశేషమే కాదు. కానీ, ఎప్పుడు చేస్తాడు అన్నదే ముఖ్యం. పదేళ్లు బిజీ అనే పులిహోర వార్తే నవ్వు తెప్పిస్తుంది.

“లైగర్” సినిమా విడుదల కాకముందే పూరి జగన్నాధ్ “జన గణ మన” సినిమా ప్రకటించాడు. దాంతో, సదరు వెబ్ సైట్లు ఇంకొంచెం ముందుకెళ్లి పూరి విజయ్ తో మూడో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు అని పులిహోర కలిపాయి. ఇప్పుడు ఏమైంది? “జన గణ మన” అటకెక్కింది.

ఇక విజయ్ దేవరకొండతో తన తదుపరి చిత్రం అని సుకుమార్ ‘పుష్ప’కి ముందు ప్రకటించారు. ఇప్పుడు దాని సంగతి ఏంటో ఎవరికీ తెలీదు. ఎప్పటికప్పుడు ఈక్వేషన్ లు మారే ఇండస్ట్రీలో పదేళ్లకి ఏ సినిమా చేస్తారో చెప్పడం కన్నా సిల్లీ ఏముంటుంది?

హిట్ కొడితే ఒక రకంగా, ఫ్లాప్ ఐతే మరో రకంగా ప్రవర్తించే ఇండస్ట్రీ ఇది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ ఏమి ఆలోచిస్తారో చూడాలి. అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో?

 

More

Related Stories