సుకుమార్ సెంటిమెంట్

Sukumar and Anasuya

సుకుమార్ కి కూడా సెంటిమెంట్స్ ఎక్కువే. ‘రంగస్థలం’ తన కెరీర్లోనే బిగ్గిస్ట్ హిట్ కావడంతో అదే ఫార్ములాని, ఆ సినిమాకి కలిసొచ్చిన ఎలిమెంట్స్ ని ‘పుష్ప’ సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నారు సుకుమార్. ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్ కీలకం. ‘పుష్ప’లో కూడా అలాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేశారట. అనసూయకే ఆ రోల్ ఇవ్వడం విశేషం.

అంటే సుకుమార్ సక్సెస్ సెంటిమెంట్ ని గట్టిగా ఫాలో అవుతున్నాడు అన్నమాట. ‘పుష్ప’ సినిమాతో హిట్ కొట్టాలి. ఎందుకంటే… ఈ సినిమాకి సుకుమార్ దాదాపు 20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇది హిట్ కొడితేనే… సుకుమార్ గ్రాఫ్ పెరుగుతుంది. లేదంటే…’1 నేనొక్కడినే’ సినిమా విషయంలో జరిగినట్లే జరుగుతుంది.

అందుకే, సుకుమార్ సెంటిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట.

More

Related Stories