టెన్షన్ పడుతున్నారా? పెడుతున్నారా?

దర్శకుడు సుకుమార్… రెండు కళ్ళు చెదిరే విజయాలు అందుకున్నారు. ఒకటి ‘రంగస్థలం’. రెండోది ‘పుష్ప’. మొదటి సినిమా తెలుగునాట సంచలనం సృష్టిస్తే రెండో చిత్రం హిందీ మార్కెట్ లో మాయ చేసింది. ‘పుష్ప’తో సుకుమార్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ వల్లే ఇప్పుడు అంచనాలు పెరిగాయి. దాంతో పాటు టెన్షన్ కూడా షురూ అయింది.

రెండో భాగం ‘భారీగా’ తీయాలంటే ఏమి చెయ్యాలన్న విషయంలోనే సుకుమార్ టెన్షన్ పడుతున్నట్లు టాక్.

‘పుష్ప 2’ విషయంలో హిందీ మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా బాగా జరగనుంది. అన్ని కలిసొస్తే ‘కేజేఎఫ్ 2’లా పెద్ద హిట్ అవొచ్చు. అందుకే, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అల్లు అర్జున్ పట్టుదలగా ఉన్నారు. హీరో పట్టుబడుతున్నారు కాబట్టి సుకుమార్ కూడా భారీతనం విషయంలో రాజీపడొద్దు అని ఫిక్స్ అయ్యారట. కానీ అంచనాలు అందుకోవడం ఎలా? ఈ విషయంలోనే తర్జన భర్జన. ఐతే, సుకుమార్ పడుతున్న టెన్షన్ కన్నా, ఆయనని టెన్షన్ పెడుతున్న వారు ఎక్కువ.

ముఖ్యంగా అల్లు అర్జున్ … తగ్గేదేలే అంటున్నారు. ఏమి చేస్తారో, ఎంత టైం తీసుకుంటారో తీసుకోండి… కానీ నాకు బిగ్ హిట్ కావాలని బన్నీ సుకుమార్ కి చెప్పారట. దాంతో, “పుష్ప 2” షూటింగ్ మరికొంతకాలం వాయిదా పడింది.

 

More

Related Stories