యాక్టింగ్ వద్దులే: సుమ

- Advertisement -

నటిగా కెరీర్ ప్రారంభించింది సుమ. కానీ, బుల్లి తెర యాంకర్ గా స్థిరపడింది. ఎందరో యాంకర్లు వచ్చారు వెళ్లిపోయారు. కానీ, సుమ మాత్రం గత రెండు దశాబ్దాలుగా ఏలుతోంది. ఇంకా చెప్పాలంటే సినిమా ఫంక్షన్లకు సుమ తప్ప మరో యాంకర్ ని తీసుకోవాలనుకోవడం లేదు మేకర్స్. అది ఆమె క్రేజ్.

ఇటీవల వరంగల్ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో జరిగిన కాలేజ్ ఫెస్టివల్ కి వెళ్లిన ఆమె తనకు యాంకరింగ్ అంటేనే ఇష్టం అని చెప్పారు. నటన వద్దులే, అది కలిసి రాలేదు అని సుమ నిర్మొహమాటంగా చెప్పారు.

ఆ మధ్య సుమ ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమాలో నటించింది. కానీ జనం ఎవరూ థియేటర్ వైపు చూడలేదు. అందుకే, ఆమె నటన వైపు ఆసక్తి చూపడం లేదు.

కేరళలో పుట్టి హైదరాబాద్ లాలాగూడలో పెరిగిన సుమ తాను పూర్తిగా తెలంగాణ అమ్మాయినే అంటున్నారు. “కేరళలో పుట్టినా నేను ఇక్కడి అమ్మాయినే. హైదరాబాదీ అని, తెలంగాణ అమ్మయిననీ గర్వంగా చెప్పుకుంటా,” అని చెపుతున్నారు. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల ఆంధ్రకి చెందినవారు.

యాంకర్ గా సంపాదించిన డబ్బులో కొంత సమాజ సేవకి ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ లో 100 మంది వృద్దులకు ఆశ్రయం కల్పించే ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఆమె నిర్మిస్తున్నారు ఇప్పుడు.

 

More

Related Stories