పుకార్లకు తెరదించిన సుమక్క

Rajeev and Suma Kanakala

సుమకున్న పాపులారిటీ గురించి స్పెషల్ గా మెన్షన్ చెయ్యక్కర్లేదు. ఆమె బుల్లితెర యాంకర్లలో సూపర్ స్టార్. లక్షల్లో సంపాదించే సుమక్క పర్సనల్ లైఫ్ గురించి ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. భర్త రాజీవ్ కనకాల నుంచి విడిపోయి వేరేగా ఉంటోంది అనేది ఒక రూమర్. అలాగే, ఆమె భర్త నుంచి విడాకులు కావాలంటూ ఇటీవల కోర్టుకెక్కింది అని కూడా కొన్ని వెబ్ సైట్స్ రాశాయి.

కానీ ఆ వార్తలపై సుమ స్పందించలేదు. ఆమె మౌనం వహించడంతో అందులో కొంత నిజముందేమో అనిపించింది. అలాగే తన భర్త ఫోటోలను షేర్ చేసింది కూడా లేదు.

ఐతే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన భర్తతో దిగిన ఇంటిమేట్ పిక్ ని షేర్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. “నా ప్రియమైన రాజా, నా లవ్, నా సంతోషానికి కారణం నువ్వు,” అనే అర్థంలో మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.

అంటే ఈ భార్యాభర్తల మధ్య బంధం గట్టిగానే ఉందని అర్థం అవుతోంది. ఆ పుకార్లకు ఆమె ఇలా అందంగా తెరదించారన్నమాట. సుమ కనకాల, రాజీవ్ కనకాలకి ఇద్దరు పిల్లలు.

Related Stories