వంటలక్కతో సుమక్క… కెవ్వు కేక

బుల్లితెరపై రెండు బలమైన శక్తులు కలిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి సందర్భమే వచ్చింది. స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ స్టార్ వంటలక్క, స్టార్ యాంకర్ సుమ కనకాల కలిశారు. ఇద్దరు కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను సుమ స్వయంగా తన సోషల్ మీడియా వాల్ పై పోస్ట్ చేశారు. మేమిద్దం ఏం చేస్తున్నామో గెస్ చేయండి అంటూ ఓ పజిల్ కూడా వదిలారు.

దీంతో నెటిజన్లు తమకు తోచిన విధంగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. వంటలక్కతో కౌంటరక్క అంటూ కొందరు సెటైర్లు వేస్తే… బుల్లితెర లేడీ సూపర్ స్టార్స్ కలిశారని మరికొందరు మెచ్చుకున్నారు. “కార్తీకదీపం” సీరియల్ లోకి సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరికొందరు కామెడీ చేస్తే.. కార్తీక ఇంట్లో సుమక్క దీపం అంటూ మరికొందరు కౌంటర్లు వేశారు.

ఇలా వీళ్లిద్దరి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎందుకంటే వీళ్లిద్దరికీ ఉన్న క్రేజ్ అలాంటిది. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ చాలా పాపులర్. ప్రతి వారం రేటింగ్స్ ఛార్టుల్లో ఈమె సీరియల్ దే అగ్రస్థానం. బిగ్ బాస్ వచ్చినా, ఐపీఎల్ మొదలైనా, మరో బ్లాక్ బస్టర్ మూవీ టెలికాస్ట్ అయినా.. అన్నీ వంటలక్క తర్వాతే. ఇక సుమ గురించి అందరికీ తెలిసిందే. తన కౌంటర్లు, పంచ్ లతో రేటింగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అందుకే వీళ్లిద్దరి ఫొటోకు అంత క్రేజ్ వచ్చింది.

Related Stories