సుమలత కూడా బీజేపీలోకి

- Advertisement -


ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ సుమలత ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు టాక్. ఆమె భర్త అంబరీష్ చనిపోయిన తర్వాత మాండ్య (కర్ణాటకలోని మైసూర్ కి దగ్గర్లో ఉండే నియోజకవర్గం) నుంచి లోక్ సభకి ఎన్నికయ్యారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

త్వరలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గ్లామర్ తారల సపోర్ట్ కోసం చూస్తోంది బీజేపీ. 59 ఏళ్ల సుమలతకి ఇప్పటికీ మాండ్యలో మంచి క్రేజ్ ఉంది. ఐతే, కొత్తగా నిర్మించిన బెంగుళూర్ – మైసూర్ ఎక్స్ ప్రెస్ రహదారిని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ త్వరలో మాండ్య వెళ్తున్నారు. దాంతో, ప్రధాని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు సుమలత ప్రకటించారు.

ప్రస్తుతానికి ఆమె బీజేపీలో చేరలేదు. ఐతే, ఆమె చేరిక అనేది ఇక లాంఛనమే.

బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గ్లామర్ స్టార్స్ ని తమ పార్టీలోకి తీసుకుంటోంది. తెలంగాణాలో కూడా అదే పద్దతి. ఇప్పుడు కర్ణాటకలో.

సుమలత కొడుకు రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారాన్ని ఆమె తిప్పి కొట్టింది. తాను మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నది తన కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసం కాదని అంటున్నారు సుమలత.

 

More

Related Stories