వాల్తేరు శీనుగా సుమంత్

‘మళ్ళీ మళ్ళీ రావా’ సినిమాతో సుమంత్ కెరీర్ కొత్త టర్న్ తీసుకొంది. త్వరలో “కపటధారి” సినిమా విడుదల కానుంది. లేటెస్ట్ మూవీకి ‘అనగనగా ఒక రౌడీ’ అనే టైటిల్‌ ఫిక్స్ అయింది. సుమంత్ బర్త్ డే (ఫిబ్రవరి 9) స్పెషల్ గా సుమంత్ లుక్‌తో పోస్టర్ ని విడుదల చేశారు. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు.

సుమంత్ ఇందులో విశాఖపట్నంలోని ఒక రౌడీగా కనిపిస్తాడు. వాల్తేరు శీను అనే పాత్ర పోషిస్తున్నాడు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

More

Related Stories