సమ్మర్ కే అసలైన ఫైట్

Vakeel Saab

సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అన్ని మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్నాయి. అందులో “క్రాక్” హిట్ అయింది. “రెడ్”, “మాస్టర్” సినిమాల డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలు చూస్తారు. కరోనా సంక్షోభం నుంచి ఇండస్ట్రీ బయటపడినట్లే. ఐతే, సంక్రాంతి తర్వాత వెంటనే తెలుగు సినిమాలు క్యూ కట్టడం లేదు.

పెద్ద సినిమాలన్నీ సమ్మర్ లో పోటీపడబోతున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా సంక్రాంతికే రావాలి. కానీ ఏప్రిల్ 9న సందడి చేయబోతోందనేది దాదాపు ఫిక్స్. ఇక సమ్మర్ రేస్ లో ‘రాధేశ్యామ్’, ‘కేజేఎఫ్ 2’, ‘ఆచార్య’ సినిమాలు కూడా ఉన్నాయి. ఐతే వీటి డేట్స్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది.

ఇతర సినిమాల్లో నాని నటిస్తున్న ‘టక్ జగదీశ్’, బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మూవీ, శేఖర్ కమ్ముల తీస్తున్న లవ్ స్టోరీ, రానా నటిస్తున్న రెండు సినిమాలు ‘విరాటపర్వం’ &’అరణ్య’, వెంకటేష్ మూవీ ‘నారప్ప’, ‘చావు కబురు చల్లగా’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటివి కూడా వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి.

సో.. సమ్మర్ కే బాక్సాఫీస్ మోత ఎక్కువగా ఉండబోతోంది.

More

Related Stories