- Advertisement -

విశాల్ హీరోగా మరో సినిమా ప్రారంభం అయింది. ఎ. వినోద్‌కుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ చెన్నైలోని సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.
విశాల్ సరసన సునైన నటిస్తోంది. సునైన ఇప్పటికే తమిళంలో మంచి పేరు తెచ్చుకొంది. తెలుగులో ఇటీవలే ‘రాజ రాజ చోర’ సినిమాలో నటించి ప్రశంసలు అందుకొంది. ఆమెకి ఇది మరో బిగ్ మూవీ. ఆమె కెరియర్ ఊపందుకుంటోంది.
ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉండనుందట. అతి త్వరలో టైటిల్‌ను ప్రకటించనున్నారు.
సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల నిడివిగల యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట.