సండే ఫండే విత్ నాగ్

- Advertisement -
Sunday Funday Bigg Boss Nonstop

“డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో నాన్ స్టాప్ గా సంచలనం సృష్టిస్తున్న “బిగ్ బాస్” ఎన్నో కొత్త కొత్త ఆకర్షణలతో, ఆశ్చర్యాలతో మరింత వినోదాన్ని అందిస్తోంది. అందులో ఆదివారం “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఇంకా ప్రత్యేకంగా ఉండబోతోంది. షో ని నడిపించడంలో అద్భుతమైన వ్యూహాలు వేసే మన బంగార్రాజు నాగార్జున ఆదివారాన్ని ఎంతో సందడి చేయబోతున్నారు.

“సండే ఫండే విత్ నాగ్” కాన్సెప్ట్ తో నాగ్ రాక ఆదివారానికి ఓ కొత్త ఫ్లేవర్ తీసుకురానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ సందడి బిగ్ బాస్ హౌస్ ని, “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ ని ఉర్రూతలూగించనుంది. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ గా ఇరవైనాలుగు గంటలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతున్నాయో చూడడం ఒక ఎత్తు అయితే, నాగార్జున హంగామా మరో ఎత్తు.

మనుషుల్ని డీల్ చేయడంలో, వాళ్ళని అంచనా వేయడంలో తనకంటూ ఒక స్పెషల్ స్టయిల్ ఉన్న నాగార్జున చేయబోయే “సండే ఫండే విత్ నాగ్” కోసం డిజిటల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

“బిగ్ బాస్ నాన్ స్టాప్” షో ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

https://bit.ly/3h9CHBT

Content Produced by: Indian Clicks, LLC

 

More

Related Stories