‘స్టార్ మా’లో బిగ్ (బాస్) ఉత్సవం

Bigg Boss Utsavam Part 2

సండే అంటే హాలిడే మాత్రమే కాదు. ఎంటర్ టైనింగ్ డే అంటోంది స్టార్ మా ఛానల్. విలక్షణమైన వినోదాన్ని అందించడంలో ముందుండి, కొత్త రకం కంటెంట్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్న స్టార్ మా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు “బిగ్ బాస్ ఉత్సవం” పేరుతో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది.

రెండు కళ్ళూ చాలనంత మంది తీసుకొచ్చి ఒకే వేదికపై నిలబెట్టి, వినోదానికి అసలైన అర్ధం చెబుతోంది స్టార్ మా. స్టార్ మా లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారమై ప్రతి సీజన్ అంతకు ముందు సీజన్ కంటే ఎక్కువ స్థాయి వినోదం అందించిన బిగ్ బాస్ లో  సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు.

ఇంతమంది సెలెబ్రిటీలు ఒక చోట కలవడం, ఇన్నాళ్లకు మళ్ళీ కలిసిన ఆనందాన్ని షేర్ చేసుకోవడం, ఆటలు పాటలు అన్నీ కలిసి ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు మరపు రాని సాయంత్రంగా మలచబోతోంది “బిగ్ బాస్ ఉత్సవం”.

ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్,  కామెడీ స్టార్స్ షో లు ఎప్పటిలాగే అలరించ బోతున్నాయి. కాబట్టి .. మిస్ కాకండి స్టార్ మా లో ఈ సండే ని.

“బిగ్ బాస్ ఉత్సవం” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: 

https://youtu.be/SHta8gJlbcg

Press release by: Indian Clicks, LLC

More

Related Stories