సందీప్ కి ఆఫర్లు పెరుగుతున్నాయి!

Sundeep Kishan

సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ చాలు కెరీర్ మారిపోవడానికి. చాలా ఏళ్ళు సరైన విజయం లేక ఇబ్బందిపడ్డ సందీప్ కిషన్ ఇటీవల ఒక హిట్ అతనికి సడెన్ గా అవకాశాలను పెంచింది.

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన “ఊరు పేరు భైరవకోన” మంచి విజయం సాధించింది. మొదట ఈ సినిమాకి కలెక్షన్లు పెద్దగా రాలేదు. కానీ ఆ తర్వాత పికప్ నెమ్మదిగా హిట్ స్థాయికి చేరుకొంది.

దాంతో, సందీప్ కి మంచి కథ, మంచి దర్శకుడు పడితే సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం నిర్మాతల్లో కలిగింది. అందుకే ఇప్పుడు అతనికి మళ్ళీ అవకాశాలు ఎక్కువ అయ్యాయి.

సందీప్ కిషన్ ఇటీవల రెండు కొత్త సినిమాలు ప్రారంభించాడు. మరో రెండు చర్చల దశలో ఉన్నయి.

More

Related Stories