రవితేజ సినిమాతో పోటీపడుతాం, మమ్మల్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది కాబట్టి మా సినిమా విడుదల వాయిదా వెయ్యమని మొన్నటివరకు ప్రకటనలు చేసిన “ఊరు పేరు భైరవకోన” టీం ఇప్పుడు వెనక్కి తగ్గింది.
రవితేజలాగే వీళ్ళు కూడా “పరిశ్రమ బాగు” కోసం తమ విడుదల తేదీని మార్చుకున్నారట. “ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి బైరవకోన సినిమా విడుదలని ఒక వారం వెనక్కి జరుపుతున్నాం. ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నాం,” అని నిర్మాత రాజేష్ తెలిపారు.
మొత్తమ్మీద, ఫిబ్రవరి 9న నాలుగు సినిమాల మధ్య పోటీ తప్పింది. ఫిబ్రవరి 9న “ఈగిల్”, “యాత్ర 2”, “లాల్ సలామ్” పోటీలో ఉంటాయి. ఇక ఫిబ్రవరి 16న వరుణ్ తేజ మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”, సందీప్ కిషన్ మూవీ “ఊరు పేరు భైరవకోన” పోటీ పడుతాయి.
మొత్తానికి అటు “ఈగిల్” సినిమా నిర్మాతలకుకి, ఇటు “భైరవకోన” టీంకి మధ్య రాజీ కుదిరింది.