రౌడీ బేబీతో సందీప్ కిషన్

- Advertisement -
Rowdy Baby launch

సందీప్ కిషన్ ఇటీవల తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి. అనే కామెడీ చిత్రం చేశాడు. మరోసారి అలాంటి కామెడీ మూవీ సైన్ చేశాడు. ‘రౌడీబేబీ’ పేరుతో సాగే ఈ సినిమా షూటింగ్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. రౌడీ బేబీ అనే సాంగ్ రీసెంట్ గా బాగా పాపులర్ అయింది. సో, క్యాచీగా ఉంటుంది అని ఈ టైటిల్ సెట్ చేశారు.

కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్టర్‌ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఫిబ్రవరి నెలనాటికంతా షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేస్తారట. సందీప్ కిషన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ ప్రెస్” కూడా విడుదలకి రెడీగా ఉంది.

More

Related Stories